సెర్చ్ ఇంజన్లు ఎలా పనిచేస్తాయి ?

సెర్చ్ ఇంజన్లు ఎలా పనిచేస్తాయి ?

WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్ . మన ప్రపంచాన్ని ఏకం చేసింది, ఏకం చేస్తున్నది ఏమూల ఏమి జరిగినా తక్షణం మనకు అందజేస్తున్నది అదే!. దీన్నే ఇంటర్నెట్ అంటాము. దీనిలో కొన్ని కోట్లాది వెబ్ సైటులు , మిలియన్లకొద్దీ పేజీల్లో నిక్షిప్తమై ఉన్నాయి. మనకు ఏదైనా విషయం గురించి వివరాలు కావాలంటే అన్ని కోట్ల వెబ్ సైట్స్ చూడలేము కదా. అలా పుట్టుకు వచ్చాయి ఈ సెర్చ్ ఇంజన్లు . ఇంటర్నెట్ లో సమాచారాన్ని వెతికేవారికి సహాయపడడానికి ఇవి ఉన్నాయి. ఒక్కో సెర్చ్ ఇంజన్ ఒక్కో రకంగా వెతికే విధానాలు కలిగి ఉన్నా సామాన్యంగా వీటన్నింటికీ క్రింది లక్షణాలు ఉంటాయి .

కొన్ని ముఖ్యమైన పదాల అధారంగా ఇవి ఇంటర్నెట్ లోని కోట్లాది పేజి లను వెతుకుతాయి.
పదాలనుబట్టి ఆయా పేజీల సమాచారాన్ని తాము ఎక్కడి నుంచి సేకరించింది , వాటికి మార్గాన్ని కూడా తనలో దాచుకుంటాయి .

వీక్షకుడు ఆయా పదాలను వెతికేటప్పుడు అ పదాలు, పదాల గుంపు ఆధారంగా ఫలితాలు ఇస్తాయి.

పూర్వం ఈ సెర్చ్ ఇంజన్లు వందల పలితాలనే ఇచ్చేవి ప్రస్తుతం అవి వివిధ పదాలకు కోట్లాది పేజీలను ఇస్తున్నాయి.
ఈ సెర్చ్ ఇంజన్లలో ముఖ్యమైనవి గూగుల్ , బింగ్, యాహూ, బైడూ, ఆస్క్ . ఇవే కాక అనేక వెబ్ సైటులు , బ్లాగులు తమలో సమాచారాన్ని వీక్షకుడు వెతకడానికి సెర్చ్ ఆప్షన్ ను కలిగి ఉంటాయి.

SEO అంటే ఏమిటి ? Search Engine Optimization

SEO అంటే ఏమిటి ? Search Engine Optimization 

అసలు Search Engine అంటే ? సెర్చ్ అంటే వెతకడం . engine అంటే యంత్రం . వెతికే యంత్రం లాంటిదన్నమాట . SEO గురించి తెలుసుకోవాలనుకోవారు . దాదాపు ఇంటర్నెట్ అవగాహన కలిగి ఉంటారు అనే ఉద్దేశ్యంతో కాస్త బేసిక్ విషయాలను వదిలేసి ముందుకు వెళతా . ప్రస్తుతం ఇంటర్నెట్ ఓపెన్ చేసేవారు ముందుగా బ్రౌజరు ఓపెన్ చేయగానే గూగుల్, యాహూ, బింగ్ లాంటి సైట్ లోకి ప్రవెశిస్తారు . లేదా ఆటోమేటిక్ గానే ఏదో ఒక సెర్చ్ పేజి వారి విండో లో కనపడుతుంది . వారికి కావాల్సిన పదాన్ని ఆయా సెర్చ్ బాక్స్ లో టైపు చెస్తారు. ఉదాహరణకు క్రొత్తగా APPSC పోస్టులు గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకునేవారు సెర్చ్ బాక్స్ లో APPSC posts అనో APPSC new posts అనో టైపు చేస్తారు అనుకొండి . వారికి క్రింది పటంలో చూపబడినట్లు రిజల్ట్స్ వస్తాయి.

పై రిజల్ట్స్ లో యెల్లో మార్కింగ్ చేయబడినది గమనించండి. 2,700,000 రిజల్ట్స్ నుండి అని వచ్చింది . అంటే గూగుల్ తన డైరెక్టరీ నుండి అన్ని పేజి లను వెతికి పట్టింది. వాటిని పేజి కి 10 చొప్పున వివిధ పేజి లలో చూపుతుంది . క్రింది పటం చూడండి .




ఇలా పేజి నంబర్స్ ఉంటాయి . మొదటి పేజిలో కనిపించే పది రిజల్ట్స్ మీద మాత్రమె వెతికేవారి దృష్టి ఉన్తున్ది. కానీ 2700000 వ రిజల్ట్ పై ఉండదు కదా !
మొదటగా వచ్చే ఆ 10 రిజట్ల్స్ పై దృష్టి పెట్టిన వీక్షకుడు ఏమి చేస్తాడు అనే విషయాన్ని రేపు తెలుసు కుందాం .
ఇప్పుడు క్రింది వీడియో చూడండి .


మీ సొంత సెర్చ్ ఇంజన్...(Google Custom search Engine)



మీకందరికి Google Custom search Engine గురించి తెలిసే ఉంటది.
ఇది ఎంతో ఉపయొగకరమయిన సాధనం.

Google Custom search Engine
ఎందుకంటారా మీరు ఎన్నొ సెర్చ్ ఇంజెన్స్ ఉపయొగించి ఉండవచ్చు, కానీ వీటితొ అప్పుడప్పుడు సమస్య ఏమిటి అంటే, ఇది మీకు మంచి సెర్చ్ రిజల్ట్స్ తో పాటు ఎన్నో అనవసరమయిన రిజల్ట్స్ ని కూడా ఇస్తుంది. చాలా మటుకు అనవసరమయిన లంకెలు ఉంటాయి వీటిలో. అలా కాకుండా మీకు నచ్చిన వెబ్ సైట్ల నుంచి మత్రమే సెర్చ్ చెసే సదుపాయం ఉంటే ??? అలాంటి సదుపాయం కొసమె ఈ google custom search engine. ఇది ఒక రకంగా మీ సొంత సెర్చ్ ఇంజిన్ లాంటిది.

google custom search engine గురించి చెప్పుకునే ముందు మనం సెర్చ్ ఇంజన్ గురించి కొద్దిగా చెప్పుకుందాము.
అసలు సెర్చ్ ఇంజిన్లు ఎలా పని చెస్తాయి అంటే అవి వెబ్ ని క్రాల్ చేస్తాయి. అంటె వెబ్ లో ఉన్న సైట్లు, వాటి information ని అవి సంగ్రహిస్తాయి అన్నమాట. అది ఎలా అంటె వెబ్ బాట్స్, లెద స్పైడర్స్ అనే వాటితొ. ఉదాహరణకి గూగుల్ ని తీసుకున్నరంటే దాన్ని గూగుల్ బాట్ అంతారు. అది ముందే నిర్ణయించిన కాల పరిమితులలొ ప్రతీ కొన్ని రొజులకూ/గంటలకూ వెబ్ లో ఉందే సైట్లను క్రాల్ చేస్తుంది. క్రాల్ చెయ్యడం అంటే ఆ పేజీలలొ ఉన్న విషయాన్ని సూక్ష్మంగా గ్రహించి, వాటిలోని కీ వర్డ్స్ తో వాటిని categorize చేస్తుంది అన్నమాట. అలా చెసిన వెబ్ పెజీ లను తన డాటా బేస్ లొ నిక్షిప్తం చెసుకుంటుంది. ఇంత వరకు చెసే పని అన్ని బాట్లూ దాదాపు ఒకే విధంగా చెస్తాయి కాకపొతే ఎలా, ఎప్పుడు, ఏ వెబ్ సైట్ల నుంచి చెయ్యాలి మొదలయిన విశేషాలు మాత్రం దేనికదే ప్రత్యేకం.

ఆ బాట్స్ క్రాల్ చెయ్యడాన్ని నియంత్రించేందుకు web aministrator, robots.txt అనే ఒక ఫైల్ తయారు చేసి అందులో తన rules ఉంచుతాడు. వాటి ప్రకారం ఆ బాట్ క్రాల్ చేస్తుంది.

సరే ఇలా క్రాల్ చేసిన information ని ఒక ఆల్గారిథం ప్రకారం మనం సెర్చ్ చేసినప్పుడు చూపిస్తుంది. గూగుల్ దీనినే పేజ్ రాంక్ అని అంటుంది.

సరే ఇక google custom search engine గురించి చెప్పుకుందాము. ఇది ఏమి చెస్తుంది అంతే సెర్చ్ ఇంజెన్ default గా కాకుండా మీకు కావలసిన సైట్లలోంచి మాత్రమే సెర్చ్ రిజల్ట్స్ ని చూపిస్తుంది. అదే కాకుండా పోగా పోగా మీకు నచ్చిన సైట్లను మీరు ఆ custom search engine కి జోడించవచ్చు. అలా మీకు కావలసిన సైట్లలోనుంచి సెర్చ్ రిజల్ట్స్ ని మాత్రమే మీరు చూడగలుగుతారు. ఉదాహరణకి మీకు వికీపీడియా లొంచి మాత్రమే సెర్చ్ చెయ్యాలనుకున్నారనుకోండి ఆ ఒక్క సైట్ ని మాత్రమె మీరు add చెయ్యవచ్చు అన్నమాట. తరువాత మీకు ఇంకొ మంచి వెబ్ సైట్ కనిపించి దీనిలొ నుంచి కూడా సెర్చ్ చెయ్యలని అనుకున్నారనుకొండి ఆ సైట్ ని మీ google custom search engine లొ జొడిస్తే చాలు.

ఎలా చెయ్యలంటే

http://google.com/coop/
అనే లంకె కి వెళ్ళండి.

అక్కడ Create your own search engine కింద ఉన్న custom search engine అనే లంకెను నొక్కి మీకు కావలసిన పేరు, ఏ సైట్లను సెర్చ్ చెయ్యలి మొదలయిన విషయాలను తెలిపి మీ యొక్క సెర్చ్ ఇంజన్ ను తయారు చేసుకొండి.

అక్కడ ఉన్న html ను మీ సైట్లో పెట్టుకుంటే మీ సెర్చ్ ఇంజను తయారు.

ఈ సెర్చ్ ఇంజను మీ ఒక్కరే కాకుండా వేరే వాళ్ళు కూడా సైట్లను add చేసే సదుపాయం ఇందులో ఉంది.